కాంగ్రెస్ ప్రభుత్వ ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే.. 7 వేల పోస్టుల భర్తీ

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ ప్రభుత్వ ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే.. 7 వేల పోస్టుల భర్తీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే 7 వేల నర్సు పోస్టులు భర్తీ చేయనుంది. పూర్తి స్థాయి కసరత్తు తర్వాత మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేసింది. నేడో, రేపో అఫీషియల్‌గా ఆ లిస్టు ను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్డేడియంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇందుకు ఆఫీసర్లు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో చేయబోతున్న ఫస్ట్ రిక్రూట్ మెంట్‌పై ఫుల్ పబ్లిసిటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. దీనిలో భాగంగానే నియామక పత్రాలను సెలబ్రేషన్ రూపంలో అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖలో చర్చ జరుగుతున్నది.

ఇదిలా ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 204 స్టాఫ్​ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ఆగస్టు 2న పరీక్ష నిర్వహించారు. 40936 మంది అభ్యర్థులు అప్లై చేయగా, 38,674 మంది ఎగ్జామ్‌కు హాజరయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబరు 15న ఆ నోటిఫికేషన్‌లో మరో 1890 పోస్టులను కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7094కు పెరగగా, ఇప్పుడు ఇవన్నీ భర్తీ చేయనున్నారు. వీటిలో డీఎంఈ పరిధిలో 5650 పోస్టులు, టీవీవీపీలో 757, ఎంఎన్ జే, గురుకులాల్లో మిగతా పోస్టులు ఉన్నాయి.

Next Story

Most Viewed