పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. 103 వాహనాలు సీజ్

by Disha Web Desk 4 |
పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. 103 వాహనాలు సీజ్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఆదివారం తెల్లవారుజామున జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ, హనుమాన్ వాడలో డీఎస్పీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు. ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన ధ్రువ పత్రాలు లేని 103 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకూడదని ఒక్కసారి పోలీస్ కేసు నమోదు అయితే ప్రైవేట్ జాబ్ కూడా రాలేని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

మూడుకు పైగా కేసులు ఉండి ఇప్పటికే పోలీస్ రికార్డులలో ఉన్నవారు మళ్లీ నేరాలు చేస్తే వాళ్లపై షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. పట్టుబడిన వాహనాలలో చాలావరకు సరైన ధ్రువ పత్రాలు లేవని కొన్నింటికి నెంబర్ ప్లేట్స్ లేకుండా మరికొన్ని నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేశారన్నారు. ఎంవిఏ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనానికి నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అన్నారు. నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలను పోలీసులకు అందించాలని డీఎస్పీ కోరారు. ఈ తనిఖీలలో టౌన్ సీఐ రామ్ చందర్ రావు, రూరల్ సీఐ ఆరీఫ్ అలీ ఖాన్ 10మంది ఎస్సైలు, 80 మంది ఇతర పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్ టీమ్ పాల్గొన్నారు.

Also Read...

రెండు జిల్లాలకు ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్.. ప్రజలకు తప్పని తిప్పలు

Next Story

Most Viewed