ఎన్టీఆర్, వైఎస్ఆర్‌, చంద్రబాబు, రేవంత్‌లో కామన్ పాయింట్.. అక్కడకు వెళ్లొచ్చాకే దశ మారిందా?

by Disha Web Desk 2 |
ఎన్టీఆర్, వైఎస్ఆర్‌, చంద్రబాబు, రేవంత్‌లో కామన్ పాయింట్.. అక్కడకు వెళ్లొచ్చాకే దశ మారిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పనిచేసిన అందరు ముఖ్యమంత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పాటు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆదిలాబాద్‌లోని నాగోబాను దర్శించుకున్న వీరంతా ముఖ్యమంత్రులు కావడం విశేషం. మొదటిసారి 1995లో అప్పటి సీఎం ఎన్టీఆర్ నాగోబాను దర్శించుకున్నారు. ఆరేళ్ల తర్వాత 2001లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, మరో ఆరేళ్ల తర్వాత 2006లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి నాబోబాను దర్శించుకోవడానికి సిద్ధమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా.

రేవంత్ మినహా మిగిలిన ఆ ముగ్గురు దిగ్గజ నేతలు ముఖ్యమంత్రి హోదాల్లో నాగోబాను దర్శించుకొని ఎవరికి వారు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు. తాజాగా ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటనలో కురిపించబోయే వరాల జల్లుపై అక్కడి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తొలి సభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. ఆ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇవాళ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి దోహదపడింది. మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ ఇంద్రవెల్లి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవడం చర్చనీయాంశమైంది. మరి ఈ సెంటిమెంట్ ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.



Next Story

Most Viewed