వేములవాడ జాతర స్పెషల్ క్యాంపు ప్రారంభం

by Disha Web Desk 4 |
వేములవాడ జాతర స్పెషల్ క్యాంపు ప్రారంభం
X

దిశ, ఆర్మూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నుండి వేములవాడకు జాతర స్పెషల్ క్యాంపును శుక్రవారం ఆర్మూర్ సీఐ సురేష్ బాబు, ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కె. కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. డ్రైవర్లకు తగు సూచనలు అందించారు. బస్సులోని ప్రయాణికులను గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చాలన్నారు.

బస్సులను ఓవర్ టేక్ చేయకుండా నిర్ణీత వేగంతో నడపాలన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డ్రైవర్లలకు సూచనలు అందించారు. ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత మాట్లాడుతూ.. గత సంవత్సరం జాతరకు ఆర్మూర్ నుండి వేములవాడకు 80 బస్సు ట్రిప్పులు నడిపామన్నారు. ఈ సంవత్సరం ఆర్మూర్ నుండి వేములవాడకు 130 నుండి 150 ట్రిప్పుల వరకు నడపనున్నట్లు తెలిపారు.

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంకా భక్తుల సౌకర్యార్థం ట్రిప్పులు పెంచే విషయం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. భక్తులను క్షేమంగా వేములవాడకు చేరవేసి తిరుగు ప్రయాణంలో వారిని సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేర్చాలన్నారు. నిర్ణీత వేగంతో బస్సుల నడుపుతూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల్సిందిగా డ్రైవర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎంఎఫ్ గంగా కిషన్, ప్రసాద్, ఈ డబ్ల్యూ‌పి మెంబర్ నాగేశ్వర్, డి‌వి‌ఎస్ చక్రవర్తి, సేఫ్టీ వార్డెన్ ఎన్ వి వి రెడ్డి, ఎస్‌డి‌ఐ హైమద్, గంగాధర్, నాగార్జున, సిస్టం సూపర్ వైజర్ కేఎల్ పతి, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed