సీఎంఓ, ఐ&పీఆర్ యూట్యూబ్ నుంచి గత ప్రభుత్వ ఆనవాళ్లు ఔట్!

by Disha Web Desk 14 |
సీఎంఓ, ఐ&పీఆర్ యూట్యూబ్ నుంచి గత ప్రభుత్వ ఆనవాళ్లు ఔట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లు.. ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏ ప్రభుత్వం అయిన వారి సీఎంఓ సోషల్ మీడియా గ్రూపుల్లో సీఎం చేసే పనులు, ప్రెస్ మీట్లు, జీవోలు లాంటి తదితర అభివృద్ధి అంశాలు పోస్టులు చేస్తది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్‌లో పోస్టులు చేసింది. తాజాగా తెలంగాణ సీఎంఓ, ఐ&పీఆర్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి పదేళ్లలో గత ప్రభుత్వం చేసిన వీడియోలు డిలీట్ చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలనుంచే ఇందులో వీడియోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెట్టింట బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో చేసినవి ఏవీ కనపడకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయండి.. కానీ గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తామంటే అది చరిత్ర ఎవరో ఒకరు తుడిచేస్తే చెరగదు.. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.



Next Story