నమ్ముకున్న వారిని సీఎం మర్చిపోరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 4 |
నమ్ముకున్న వారిని సీఎం మర్చిపోరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జలవిహార్‌లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలను, నాయకులను సీఎం కేసిఆర్ మర్చిపోరు అన్నారు. ఉద్యమం నుండి తన వెన్నంటి ఉన్న గెల్లు శ్రీనివాస్‌కు పదవి ఇచ్చారన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు.

దేశంలో కేసిఆర్ లాంటి వ్యక్తిని నాయకుడిగా కోరుకుంటున్నారన్నారు. అనేక పథకాలు అమలు చేస్తూ దేశంలోనే నంబర్ 1 సీఎం గా కేసీఆర్ పేరు పొందారని తెలిపారు. మన రాష్ట్రంలో మన పార్టీలో నిబద్దతతో పని చేస్తే పదవులు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ దేశంలో గొప్ప పార్టీగా అవతరించబోతోందన్నారు. గెల్లు శ్రీనివాస్‌ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బాధ్యత నాపై పెట్టిన కెసీఆర్‌కు ధన్యవాదాలు అన్నారు. విద్యార్థి దశ నుండి కేసీఆర్ నన్ను ప్రోత్సహించారన్నారు. 2001 నుండి ఉద్యమంలో ఉన్నా అన్నారు.

ఆయన ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా పని చేశానని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల కోట్లు ఉండి, వందల ఎకారాలు ఉన్న వ్యక్తిని ఢీ కొట్టడానికి నన్ను బరిలో దింపారన్నారు. 80 వేల పై చిలుకు ఓట్లను హుజురాబాద్ ప్రజలు తనకు వేశారన్నారు. కానీ ఆయన డబ్బు వల్ల మనం ఒడిపోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా ఉందన్నారు. అనేక టూరిజం స్పాట్స్ ఇక్కడ ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో టూరిజం ఆదాయం పెరిగేలా కృషి చేస్తానన్నారు.



Next Story

Most Viewed