కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 12 |
కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కేరళకు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో చోటు దక్కించుకున్న సీఎం రేవంత్.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అయిన రాహుల్ గాంధీ తరుఫున వయనాడ్‌లో ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే తెలంగాణ మంత్రి సీతక్క ప్రస్తుతం కేరళలో రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ అక్కడికి వెళ్లనున్నారు. కాగా ఈ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story

Most Viewed