కేసీఆర్‌కు CM రేవంత్ రెడ్డి బర్త్‌డే గిఫ్ట్.. చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్..!

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు CM రేవంత్ రెడ్డి బర్త్‌డే గిఫ్ట్.. చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష లీడర్ కేసీఆర్‌కు అసెంబ్లీ వేదికగా బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అందుకే శుక్రవారం ప్రవేశపెట్టాల్సిన ఇరిగేషన్ వైట్‌పేపర్‌‌ను నేటికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తున్నది. నేడు కేసీఆర్ 70వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గులాబీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వేడుకలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెడుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ షెడ్యూల్‌ను మార్చుకుని అసెంబ్లీకి వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతున్నది.

చివరి నిమిషంలో స్ట్రాటజీ చేంజ్..

వాస్తవానికి శుక్రవారం ఇరిగేషన్ పై వైట్ పేపర్ పెడుతున్నట్టు అసెంబ్లీ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అందుకు సభలో 2 వైపులా ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. వైట్ పేపర్‌పై ఏం మాట్లాడాలి? ఏఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి? అని స్టడీ చేసేందుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన చాంబర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కసరత్తు చేశారు. అలాగే, బీఆర్ఎస్ నుంచి ఇరిగేషన్ పై మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారు. బీసీ కులగణనపై ప్రవేశపెట్టిన తీర్మానం పై చర్చ తరువాత సభను వాయిదా వేశారు. సభా తిరిగి ప్రారంభమైన వెంటనే ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు. కానీ వైట్‌పేపర్ పెడితే సాయంత్రం అయినందున చర్చకు సమయం సరిపోదని కాంగ్రెస్ సభ్యుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.

బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్లాన్

బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ బర్త్ డే రోజున ఇరిగేషన్ పై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. పదేళ్ల కాలంలో కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన అప్పులు, దానికొచ్చిన ప్రయోజనాలను లెక్కలతో సహా విడుదల చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆయన హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల డిజైన్, నాణ్యత ఏ విధంగా ఉందోనని చెప్పేందుకు ఫొటోలు, వీడియోలను రెడీ చేశారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శిచేందుకు ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికలో ఏం ఉందో కోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ కోసం చేసిన వేల కోట్ల ఖర్చు మొత్తం వృథా అయిందని చెప్పేందుకు రెడీ అయ్యారు.

కన్ఫ్యూజన్‌లో గులాబీ ఎమ్మెల్యేలు..

కేసీఆర్ పుట్టిన రోజు వేడుకులకు వెళ్లాలా? లేక అసెంబ్లీకి వెళ్లి ఆయనపై చేసే విమర్శలను తిప్పికొట్టాలా? అనే కన్ఫ్యూజన్‌లో గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సభకు వెళ్లకుండా డుమ్మా కొడితే అధికార పక్షం నుంచి విమర్శలొస్తాయి. అలాగని కేసీఆర్ వేడకలకు స్వయంగా హాజరుకాకపోతే, అధికారం పోయిందని నైరాశ్యంలో ఎమ్మెల్యేలు ఉన్నారనే సంకేతాలు వెళ్తాయెమోనని అనుమానంలో ఉన్నారు. అయితే, కేసీఆర్ ఆదేశాల మేరకు సభకు వెళ్లాలా? లేదా? అనేదానిపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అనుకుంటున్నారు.



Next Story

Most Viewed