పేద విద్యార్థుల పాలిట దేవుడు సీఎం రేవంత్: మానవతారాయ్

by Satheesh |
పేద విద్యార్థుల పాలిట దేవుడు సీఎం రేవంత్: మానవతారాయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తేనే విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందని కాంగ్రెస్ నేత కోటూరి మానవతా రాయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మానవతా రాయ్ మాట్లాడుతూ.. ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయకుండా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చి దిద్దుతామని సీఎం ప్రకటించడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికింప పడుతుందని కొనియాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల పాలిటి దేవుడని ఆయన అభివర్ణించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరహాలో ఆలోచించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఆలోచన చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మేడారపు సుధాకర్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్ గౌడ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓయూ నేత పట్ల నాగరాజు, నిరుద్యోగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు హేమంత్ చౌదరి, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నాయకులు సుదగాని మధు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story