బీజేపీ తీరుతో ప్రమాదకర స్థితిలో భారత్: కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్

by Disha Web Desk 19 |
బీజేపీ తీరుతో ప్రమాదకర స్థితిలో భారత్: కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మద్దతు కోరేందుకు ఇవాళ ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. గవర్నర్లతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. కేంద్రం తీరువల్ల ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనబెడుతూ మోడీ సర్కార్ ఢిల్లీలోని అధికారుల బదిలీల కోసం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు తీర్పుకు విరుద్ధంగా ప్రధాని ఆర్డినెన్స్ తీసుకువచ్చి మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

సుప్రీం తీర్పును పక్కన పెడుతూ కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అమానకరమన్నారు. రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదని.. విపక్షాలు ఏకమైతే ఢిల్లీలోని అధికారుల బదిలీల కోసం తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్‌ బిల్లు పాసవ్వదని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమకు మద్దతు కోసం సీఎం కేసీఆర్‌ను కలిశానని.. కేసీఆర్ అండతో తమకు మరింత బలం పెరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ తీరుతో దేశం ప్రమాదకర స్థితిలో పడిపోయిందని ధ్వజమెత్తారు.



Next Story