బ్రేకింగ్: పెన్షన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: పెన్షన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం సూర్యపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ తన జన్మహక్కుల రూ. 1000 పెన్షన్ ఇవ్వలేదని.. రూ. 200 పెన్షన్ ముఖాన కొట్టారని ఫైర్ అయ్యారు. గతంలో రూ.200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రూ. 4 వేలు అంటుందని.. వాళ్లు నాలుగు వేలు ఇస్తే నేను ఇంకో వెయ్యి రూపాయలు పెంచాలేనా అని అన్నారు.

తప్పకుండా తాము పెన్షన్ పెంచుతామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా ఛత్తీస్‌గఢ్, కర్నాటకలో రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటాడు.. మరొకడు మూడు గంటలు ఉచిత విద్యుత్ చాలంటాడు అని పరోక్షంగా ప్రధాని మోడీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు కురిపించారు. మళ్లీ మనకు పాత రోజులు కావాలా అని అన్నారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పాత కథే మొదటికొస్తుందన్నారు.

మళ్లీ దరఖాస్తులతో ఆఫీసుల చూట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ఒక్కసారి ధరణిలోకి భూమి ఎక్కితే దానిని మార్చే మొనగాడు ఉన్నాడా అన్నారు. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా ఆ పవర్ లేదని తెలిపారు. భూమిని మార్చే అధికారం రైతు బొటన వేలుకే ఉందన్నారు. ధరణితో రైతుకే అధికారం ఇచ్చామని.. దీనిపై రైతులు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యమే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్క అవకాశం అంటున్నాయని.. ఆ పార్టీలకు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేశారని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed