CM KCR: ధరణి పోర్టల్ తో రైతులకు మేలు జరిగింది..

by Disha Web Desk 14 |
CM KCR: ధరణి పోర్టల్ తో రైతులకు మేలు జరిగింది..
X

దిశ, వెబ్ డెస్క్: ధరణి పోర్టల్ తో రైతులకు మేలు జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన ఎన్ని ప్రయోజనాలు అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ధరణి లేకపోతే మళ్ళీ భూ తగాదాలు వస్తాయని, ధరణి లేకపోతే రైతుల అకౌంట్లలో డబ్బులు పడవని అన్నారు.

ధరణి పోర్టల్ రావడం వలన దాదాపు 99 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు చిన్ని చిన్న లోపాలు సాధారణని, అంతమాత్రానికే ధరణిని తీసేయలనడం సరికాదని సీఎం అన్నారు. ధరణి వల్ల పల్లెల్లో గొడవలు తగ్గి నేరాలు కూడా తగ్గాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ధరణి పోర్టల్ కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

Also Read..

ధరణి రూటే సప‘రేటు’.. రైతుల నడ్డి విరుస్తున్న ఆన్​లైన్ రిజిస్ట్రేషన్



Next Story

Most Viewed