CM KCR ఆఫర్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
CM KCR ఆఫర్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. గతంలో వైఎస్సాఆర్, కేసీఆర్‌లు ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించాన‌న్నారు. అధికారం, కాంగ్రెస్ ఈ రెండింటిలో మీ గుండెల్లో ఏముంది అని అడిగిన ప్రశ్నకు తన మదిలో ప్రజలు ఉన్నారన్నారు. తాను ఇండింపెండెంట్‌గానే జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచానన్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉన్న ఓటర్లు మోడీ, అమిత్ షా ఇద్దరు సెగ్మెంట్లలో ఉన్న ఓటర్ల కన్నా ఎక్కువ అన్నారు. మల్లు భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్ననని చెప్పారని రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పగా.. రేవంత్ రెడ్డి బదులిస్తూ తమ పార్టీలో గెలవబోయే 80 మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాండిడేట్లే అన్నారు. సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. అధికారం కోసం తాను ఆశిస్తే ఇప్పటికే అధికార పక్ష పార్టీల్లో కీలక పదవుల్లో ఉండే వాడినని.. అయినా పదవులు ఆశించలేదు కాబట్టే ప్రతిపక్ష పార్టీకి పీసీసీ చీఫ్‌గా ఉన్నానన్నారు. 20 ఏళ్లుగా అపొజిషన్ పార్టీలో ఉన్నానని దాంతోనే తాను సంతోషంగా ఉన్నానన్నారు.Next Story

Most Viewed