ధరణిని కాదు.. మిమ్మల్ని బంగాళాఖాతంలో విసిరేస్తారు: CM KCR

by Dishafeatures2 |
ధరణిని కాదు.. మిమ్మల్ని బంగాళాఖాతంలో విసిరేస్తారు:  CM KCR
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ ధరణిని కాదు వాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలని అన్నారు.ధరణిని తీసేస్తే రైతు బంధు, రైతు బీమా రాదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ భూతగాదాలు వస్తాయని అన్నారు. ధరణి వల్ల భూమికి ధరలు పెరిగాయని అన్నారు.. ధరణి వల్లే ఇవాళ రాష్ట్రంలో రైతులు సుఖంగా ఉన్నారని అన్నారు. ఈ రోజు రైతు బంధు డబ్బులు పడతున్నా.. రైతు బీమా సాయం అందుతున్నా అదంతా ధరణి వల్లే సాధ్యమైందని అన్నారు.

మూడేళ్లు కష్టపడి ధరణి ని తీసుకొచ్చానని, ధరణి వల్ల భూసంస్కరణలు అవుతున్నాయని అన్నారు. భూమిపై రైతులకు ఉండే అధికారాన్ని కలెక్టర్, ఎమ్మార్వో.. చివరికి సీఎం కూడా తీసేయకుండా ధరణి ద్వారా హక్కును కల్పించామని అన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారిందని అన్నారు. 134 ఏళ్ల సింగరేణి తెలంగాణ ఆస్తి అని సీఎం అన్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ ప్రభుత్వం నిండుగా ముంచిందని అన్నారు.

Also Read:

మన పథకాలను పక్క రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.. CM KCR

ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న ప్రజలు.. ఏం చేశావంటూ వరుసగా నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్

Next Story

Most Viewed