కలెక్టర్ల సమీక్ష తర్వాత సీఎం గుడ్ న్యూస్: మంత్రి పొంగులేటి

by Disha Web Desk 19 |
కలెక్టర్ల సమీక్ష తర్వాత సీఎం గుడ్ న్యూస్: మంత్రి పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెబుతాని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాబోయే 3, 4 నెలలో ఇళ్లను అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఫణిగిరిగట్టు వద్ద ఉన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితం అయిందని, హుజూర్ నగర్‌లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు కట్టించిందన్నారు. అదే కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు నిర్మించామన్నారు.

హుజూర్ నగర్‌లో 2,100 ఇళ్లు పూర్తి చేసి త్వరలోనే అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ పనులు పెడింగ్‌లో ఉన్నాయని గత ప్రభుత్వం భూములను అన్యాక్రాంతం చేసిందని ధ్వజమెత్తారు. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన సాగిందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయని, చెక్ డ్యామ్‌లపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలోనే గ్యాస్ స్కీమ్‌ను అమలు చేస్తామన్నారు.

Next Story

Most Viewed