బ్రేకింగ్: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం.. 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం.. 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం మంత్రి హరీష్ ఈ పథకాన్ని ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో ఈ స్కీమ్‌ను హరీష్ రావు లాంచ్ చేశారు. సీఎం బ్రేక్ ఫాస్ట్‌ను ఇదే స్కూల్ నుండి కేసీఆర్ ప్రారంభిస్తారని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రావిర్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.

సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్ పల్లి పాఠశాలలో మంత్రి కేటీఆర్ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను లాంఛ్ చేశారు. ఇక, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 8.45 నిమిషాలకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం ఉదయం 8 గంటలకే విద్యార్థులకు టిఫిన్ అందించనున్నారు.

బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే:

సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ

మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ, చ‌ట్నీ

బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ

గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్

శుక్రవారం– ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ

శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ

Next Story

Most Viewed