పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టండి.. సీఎస్‌కు సీఎల్పీ నేత రిక్వెస్ట్​

by Nagaya |
పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టండి.. సీఎస్‌కు సీఎల్పీ నేత రిక్వెస్ట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ​పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎస్​శాంతికుమారితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్​మల్లు రవిలు భేటీ అయ్యారు. పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్‌ని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పంజాగుట్టలో పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికే ఆ విగ్రహాన్ని వీహెచ్ హనుమంతరావుకు అప్పగించాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్​స్టేషన్‌లో పెట్టడం అవమానించడమేనని భట్టి చెప్పారు. అంబేడ్కర్‌కు అవమానం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలుగా చూస్తూ ఊరుకోలేమన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం బాధకరమన్నారు. వీహెచ్​మాట్లాడుతూ.. పంజాగుట్ట వద్దనే అంబేద్కర్ విగ్రహం పెట్టాలని దళితులంతా కోరుతున్నారని సీఎస్‌కు వివరించామన్నారు. విగ్రహం పెట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు.

Next Story

Most Viewed