111 జీవో ఎత్తివేత పెద్ద స్కామ్: భట్టి విక్రమార్క

by Disha Web Desk 2 |
111 జీవో ఎత్తివేత పెద్ద స్కామ్: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: 111 జీవో ఎత్తివేత పెద్ద కుట్ర అంటూ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన అనుయాయులకు, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవోను ఎత్తేశారని ఆరోపించారు. ఇవాళ ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లు ఊర్ల మీద పడి భూములు కొనుగోలు చేశారని.. తాజాగా 111 జీవో ఎత్తేసి బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈ జీవో ఎత్తివేతతో ఆయా గ్రామాల్లోని రైతులకు, ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లీడర్లు ముఠాలుగా ఏర్పడి.. ముందుగానే భూములు సేకరించుకున్నారని.. ఆ తర్వాత జీవోను ఎత్తివేశారని ఆరోపించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదమని పేర్కొన్నారు.

Also Read..

వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు: రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed