పల్లాకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్‌‌‌‌కు నష్టం

by Disha Web Desk 22 |
పల్లాకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్‌‌‌‌కు నష్టం
X

దిశ, చేర్యాల: జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. జనగామ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్ శ్రీరాములు పోటాపోటీగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఒక్కసారిగా జనగామ నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి దాదాపు కరారైనట్లు ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాకుండా జోరుగా ప్రచారం చేస్తుడటంతో... శనివారం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొమురవెల్లి లో పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం చేర్యాలలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. పల్లా వద్దు - ముత్తిరెడ్డి ముద్దు అనే నినాదాలతో జనగామ జిల్లా కేంద్రానికి ర్యాలీగా బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గీయులు మాట్లాడుతూ..గత 9 ఏళ్లుగా జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని పటిష్ఠం చేసి నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సైతం అందుబాటులో లేని వ్యక్తి జనగామ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటిపడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ హై కమాండ్ 3వ సారి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ కేటాయించాలని లేని పక్షంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించాలి తప్ప పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీకెట్ కేటాయించవద్దని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed