Breaking: పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ వ్యూహం ఇదే...!

by Disha Web Desk 16 |
Breaking: పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ వ్యూహం ఇదే...!
X

దిశ, వెబ్ డెస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత విచారణ సమయంలో ఢిల్లీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలను పార్లమెంట్‌లోనూ వినిపించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీని దుర్వినియోగం చేస్తున్నారని సోమవారం పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్నారు. తమతో కలిసి వచ్చే విపక్ష పార్టీలతో ఆందోళన చేయనున్నారు. ఇప్పటికే ఆప్, టీఎంసీ, సమాజ్ వాదీ, ఇతర విపక్ష పార్టీలతో బీఆర్ఎస్ అధినేత, ఎంపీలు మాట్లాడారు. అలాగే పార్లమెంట్ బయట కూడా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయనున్నారు.



Next Story

Most Viewed