‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’

by Disha Web Desk 2 |
‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అప్పుడు వైఎస్ బూట్లు నాకారు.. ఇప్పుడు మోడీ బూట్లు నాకుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ పక్కన తమ జిల్లా కాంగ్రెస్ నేతలు బాడీ గార్డుల్లా నిలబడటం సిగ్గుచేటని విమర్శించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొద్దున ఏం మాట్లాడతారో రాత్రి ఏం మాట్లాడతారో తెలియదన్నారు. కాంగ్రెస్ నేతలు మోకాళ్ళ మీద నడిచినా ఆ పార్టీకి నల్గొండలో డిపాజిట్లు రావని మండిపడ్డారు.

రాహుల్‌కు శిక్షపడితే నోరు మెదపని దద్దమ్మలు

నల్గొండ కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు. పైసలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నా అని అహంకారమో.. చంద్రబాబు ఏజెంటనో అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. ఓటుకు నోటు దొంగ నీతులు చెబితే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితన్నారు. రాహుల్ గాంధీకి శిక్ష పడితే నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని విమర్శించారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. నల్గొండలో జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగ నాయకుల సభ అని విమర్శించారు. రేవంత్ లాంటి వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అర్థం కాదన్నారు.

టీఆర్ఎస్ కార్యాలయాలు కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో కాంగ్రెస్ నేతలు తమ ఉద్యోగాల కోసం సభ పెట్టుకున్నారని, నిరుద్యోగుల కోసం కాదని ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ అంబేద్కర్ తర్వాత అంతటి గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎడారిగా మార్చిన నల్గొండ జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేశారన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. బూతులు మాట్లాడటానికే కాంగ్రెస్ నేతలు సభలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బూడిదలో బొరిలే కుక్క కలలు కన్నట్టు కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. సభలో కాంగ్రెస్ నేతలు ఊర కుక్కల్లా మోరుగుతున్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed