నేడు BRS ఆవిర్భావ సభ.. 10 గంటలకు బేగంపేటకు CM KCR

by Disha Web Desk 4 |
నేడు BRS ఆవిర్భావ సభ.. 10 గంటలకు బేగంపేటకు CM KCR
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు హాజరుకానున్నారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డీ. రాజాలు సైతం బీఆర్ఎస్ కు సంఘీభావం తెలుపుతూ ఖమ్మం సభకు రానున్నారు. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభకు 4,198 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉ. 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు సీఎం కేసీఆర్ బయల్దేరనున్నారు. ఉ.10.30 గంటలకు యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. కేసీఆర్‌తో పాటు యాదాద్రికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెళ్లనున్నారు. అనంతరం పినరయి విజయన్, భగవంత్ మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్‌లతో కలిసి 11.30 గంటలకు ఖమ్మంకు సీఎం వెళ్లనున్నారు. ఖమ్మంలో కంటివెలుగును సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వెంకటాయపాలెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే విషయంలో ఆసక్తి నెలకొంది.

Also Read....

NTR ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, kalyan Ram నివాళులు

Next Story

Most Viewed