కాంగ్రెస్‌లోకి MLA దానం నాగేందర్.. BRS పార్టీ సంచలన నిర్ణయం

by Satheesh |
కాంగ్రెస్‌లోకి MLA దానం నాగేందర్.. BRS పార్టీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం రాజీనామా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయిట్మెంట్ కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ స్పీకర్ ఇంటికి వెళ్లారు. అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ స్పీకర్ తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మరోసారి స్పీకర్‌ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతామని తెలిపారు. పార్టీ మారిన రోజే దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed