BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ సీఎం రమేష్‌కు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదు

by Disha Web Desk 1 |
BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ సీఎం రమేష్‌కు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు ఊహించని షాక్ తగిలింది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి దాదాపు రూ.450 కోట్లు మాయం చేశారనే ఆరోపణలతో ప్రముఖ సినీ హీరో వేణు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఇవాళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. వేణు ఫిర్యాదును ప్రస్తుతం పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, ఈ కేసులో సినీ హిరో వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు వాగ్మూలం ఇచ్చారు.

కాగా, ఇటీవల బయటికొచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి రూ.30 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లుగా ఎస్‌బీఐ స్టేట్‌మెం‌ట్‌లలో ఉంది. అదేవిధంగా జనతాదల్‌ సెక్యులర్‌ పార్టీకి రూ.10 కోట్లు, టీడీపీకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉండి ప్రతిపక్ష కాంగ్రెస్‌కు విరాళం ఇవ్వడం ఏంటని ఏపీ పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed