BREAKING: ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టు గేట్లు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 1 |
BREAKING: ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టు గేట్లు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ అవే బూటకపు హామీలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తోందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడతున్నారని ధ్వజమెత్తారు. ఈ సమయంలో ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని.. ప్రాజెక్ట్ గేట్లంటూ కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారంటూ ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వంద రోజుల్లో సంపద అంతా దోచుకున్నారని, ఢిల్లీకి సంచులు మోస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రైతుల పంటలు ఎండి ఏడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి వారిని పరమర్శించేది పోయి ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ వెళ్తుందని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని వదిలి సీఎం రేవంత్ రెడ్డితో సహా, మంత్రలు కూడా తమ పదవులను కాపాడుకునేందుకు ప్రధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మిల్లర్లు, క్రషర్‌ యజమానులు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు పాల్పడతున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్‌ నేతల మాటల్లో రైతుల ప్రస్తావనే ఉండటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం రైతులపై లేదని మండిపడ్డారు. రైతులు చనిపోతుంటే మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడని ఆరోపించారు. జేబు దొంగలు, పగటి దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందని మండిపడ్డారు.


Next Story

Most Viewed