BREAKING: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం

by Disha Web Desk 1 |
BREAKING: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. పిటిషన్‌పై గురువారం ఉదయం నుంచి కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో కొనసాగనుంది. కాగా, గత ప్రభుత్వంలో నామినేటేడ్ కోటాలో బీఆర్ఎస్ నేతలు నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎన్నికను గవర్నర్ తమిళి‌సై నిరాకరించిన విషయం తెలిసిందే.

దీంతో వారు గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేబినెట్ ఆమోదించినప్పటికీ తమ నియామకంలో గవర్నర్ తన అధికార పరిధికి మించి వ్యహహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఎన్నికపై క్లారిటీ వచ్చే వరకు నామినేటేడ్ కోటా నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, అమీర్ అలీ‌ఖాన్ ఎన్నికపై కోర్టు స్టేను విధించింది. ఈ క్రమంలో హైకోర్టు ఎలాంటి తీర్పుపై వెలువరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story

Most Viewed