BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కీలక నేత

by Shiva |
BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కీలక నేత
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అయితే, గురువారం సాయంత్రం మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డి కూన శ్రీశైలం ఇంటికి వెళ్లారు. ఈ మేరకు వారు ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వనించారు. దీంతో ఆయన ఇవాళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

కాగా, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆ‎శించిన కూన శ్రీశైలం గౌడ్‌కు నిరాశే ఎదురవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని.. కాబట్టి మేడ్చల్ జిల్లాలో పట్టున్న తనకే మల్కాజ్‌గిరి ఎంపి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయనను పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయించారంటూ ఇటీవల ఆయన సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో కూన శ్రీశైలం గౌడ్ చర్చలు జరుపారు. ఈ మేరకు ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

Next Story

Most Viewed