ఢిల్లీలో బోనాల వేడుకలు.. బంగారు బోనం సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్

by PRASAD JUKANTI |
ఢిల్లీలో బోనాల వేడుకలు.. బంగారు బోనం సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేవుడిని భిన్న రూపాల్లో మొక్కడం సెక్యులరిజానికి నిదర్శనం అని, ఈ సంస్కృతి బోనాల ఉత్సవాల్లో కనిపిస్తుందని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన గవర్నర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటలో అన్ని మతాలవారు అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారని.. ఇది నిజమైన సెక్యులరిజానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Next Story