బీజేపీ VS బీఆర్‌ఎస్.. ఫ్లెక్సీ వార్ కంటిన్యూ

by Disha Web Desk 4 |
బీజేపీ VS బీఆర్‌ఎస్.. ఫ్లెక్సీ వార్ కంటిన్యూ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఫ్లెక్సీ వార్ కంటిన్యూ అవుతోంది. శుక్రవారం ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తేలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. దానికి పోటీగా శనివారం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అవి అమలు చేయకపోవడంతో దానిని ఎండగడుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై..

ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడంటూ వ్యంగ్యంగా వెలిసిన ఫ్లెక్సీలు వెలిశాయి. శుక్రవారం ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో తాను గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీపై రైతులు ఏర్పాటు చేసినట్టు ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన విషయం తెలిసిందే.

దానికి కౌంటర్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సాయంత్రం విడుదల చేసిన వీడియో ఆధారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ బీఆర్ఎస్‌ల మధ్య రాజకీయ అగ్గి రాజుకుంది. శనివారం ఉదయం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన నాన్న అన్నలతో ఫ్లెక్సీ అంటూ ఎమ్మెల్సీ కవిత ఫోటోతో ఫ్లెక్సీని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూములు ఎక్కడ అని ప్రశ్నిస్తున్న మహిళలు అంటూ మరో ఫ్లెక్సీని ప్రధాన కూడళ్లలో కట్టివేశారు.

నిరుద్యోగులకు ఇస్తానన్న నెలకు రూ.3016 రూపాయలు ఎక్కడ? అంటూ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గేటుకు కట్టారు. తెలంగాణ జిల్లాలో అత్యధికంగా గల్ఫ్ కార్మికులు ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అయిన రూ.500 కోట్లతో ఎన్నారై సెల్ గురించి ఎన్నారై సెల్ ఎక్కడా?అని ప్రశ్నిస్తున్న గల్ఫ్ కార్మికులు అంటూ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

రూ.లక్ష రూపాయల రుణమాఫీ, ఉచిత ఎరువుల పంపిణీ అమలయ్యేదెప్పుడు అంటున్న రైతులు అని మరో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్న దళిత సోదరులు అంటూ ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు అప్పటికప్పుడు చించి వేశారు. ఉన్న వాటిని కట్టిన తర్వాత సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో బిజెపి నాయకులు పోస్ట్ చేశారు. కాగా నిజామాబాద్ లో పొలిటికల్ వార్ ఒక్క సారిగా రాజకీయ దూమారం రేపింది.



Next Story

Most Viewed