- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ts News: తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయనున్న బీజేపీ.. ఢిల్లీలో స్పష్టం చేసిన లక్ష్మణ్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ ఒంటరీగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అధికారంలోకి వచ్చేందుకు 100 రోజుల ప్రణాళికలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌కు బీజేపీనే పూర్తి ప్రత్యామ్నాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు. సర్వేలు ఎన్ని రకాలుగా ఉన్నా తెలంగాణలో విజయం సాధిస్తామని లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వచ్చే ఎన్నికల్లో చూస్తారని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎలాంటి యాత్రలు చేసిన ప్రజలు నమ్మరని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. కేంద్రం ఆమోదించిన రైల్వే ప్రాజెక్టుపై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో మంత్రి కేటీఆర్‌కు కను విప్పు కలగాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు.