రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కూడా తప్పుబడుతుందా?: రఘునందన్ రావు

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కూడా తప్పుబడుతుందా?: రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. న్యాయస్థానానికి వస్తున్న పిటీషన్ల ఆధారంగా పరిశీలిస్తే దాదాపు 20 వరకు సమస్యలు ప్రధానంగా పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, సీసీఎల్ఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజంగా ప్రజలకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇంత గందరగోళం ఎందుకు అని ప్రశ్నించారు. అసమర్థ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపాల వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించారు. ధరణి విధానం వల్ల అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ‘ఇప్పుడు టీఎస్‌ ప్రభుత్వం హైకోర్టును కూడా తప్పుబడుతుందా’ అని ప్రశ్నించారు.

Next Story