బీజేపీకి ఆ అర్హత లేదు : మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 4 |
బీజేపీకి ఆ అర్హత లేదు : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : ప్రజాస్వామ్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకునే అర్హత లేదన్నారు. శుక్రవారం నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న కుల వివక్ష జాడ్యాన్ని పారదోలెందుకు కృషి చేసిన విశ్వ మానవతా తత్త్వవేత్త అంబేడ్కర్ అన్నారు.

రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షులుగా ఆయన సేవలు అద్భుతమన్నారు. భారతదేశంలోని 125 అడుగుల క్యాంస విగ్రహం ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో గౌరవ ప్రదంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ రానున్నారని తెలిపారు. దేశ వనరులను అన్ని ప్రజల వర్గాలకు చెందాలన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని చేసుకునే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సహపంక్తి భోజనం చేశారు. అంతకు ముందు హైదరాబాదులో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా ప్రారంభోత్సవానికి వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ఏడు ఆర్టీసీ బస్సులలో 350 మంది దళిత నాయకులు, ప్రజలు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రాష్ట్ర దళిత నాయకులు కోళ్ల వెంకటేష్, దళిత నాయకులు మహిళా ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed