- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కేటీఆర్, హరీశ్‌కు చేదు అనుభవం.. బస్సుపై కోడిగుడ్ల దాడి
దిశ, డైనమిక్ బ్యూరో:నల్గొండ సభ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో సభకు వస్తుండగా వీటీ కాలనీ వద్దకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న బస్సుకు అడ్డుగా వెళ్లిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బస్సుపై కోడిగుడ్లు విసిరారు. నల్లాచొక్కాలతో నిరసన తెలిపిన కార్యకర్తలు బీఆర్ఎస్, కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే క్రమంలో కొంత మంది పోలీసుల నుంచి తప్పించుకుని బస్సు వైపు దూసుకుపోయి ఈ దాడికి పాల్పడ్డారు. కాగా కేసీఆర్ నల్గొండ సభను అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
- Tags
- brs
- ktr
- harish rao