రోగులను గాలికొదిలేసి.. ఆపరేషన్ థియేటర్‌లో బర్త్ డే వేడుకలు

by GSrikanth |
రోగులను గాలికొదిలేసి.. ఆపరేషన్ థియేటర్‌లో బర్త్ డే వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అతిగా పెరిగిపోవడం మూలంగా వయసుతో సంబంధం లేకుండా వింత చేష్టలకు పాల్పడుతున్నారు. వైరల్ కావడమే లక్ష్యంగా ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు కావాలనే లక్ష్యంతో ఎంత ట్రై చేసినా ఉపయోగం లేకుండా పోతుండగా.. మరి కొందరు ఒకటి రెండు వీడియోలకే ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆపరేషన్ థియేటర్‌లో ఏకంగా డిప్యూటీ DMHO పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్‌లో కేక్ కట్ చేసి, వింధు భోజనాలు చేశారు. ఇదంతా పార్టీలో పాల్గొన్న సిబ్బంది ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అవి కాస్త వైరల్ అయ్యారు. ఆపరేషన్ థియేటర్లో బర్త్ డే పార్టీలు ఏంటంటూ సిబ్బందిపై నెటిజన్లు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Next Story