బిగ్ బ్రేకింగ్ : కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు

by Rajesh |
బిగ్ బ్రేకింగ్ : కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 57 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా 10 స్థానాల్లో గెలిచింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో మాట్లాడుతూ.. కేసీఆర్ కాళ్లు మొక్కయినా నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇస్తానని చెప్పిన ప్రజలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడం గమనార్హం.Next Story

Most Viewed