ద్వేషంపై ప్రేమ గెలిచింది.. రాహుల్ గాంధీ కేసులో సుప్రీం తీర్పుపై భట్టి రియాక్షన్

by Dishafeatures2 |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఈ కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది. తాజాగా ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ కేసులో స్టే విధించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వేషంపై ప్రేమ విజయంగా ఆయన అభివర్ణించారు.

ఎప్పటికైనా సత్యమే గెలుస్తోందని ఆయన అన్నారు. కాగా 2019 నాటి పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గతేడాది సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన తిరిగి తన ఎంపీ పదవిని పొందే ఛాన్స్ ఉంది.

Next Story

Most Viewed