రాహుల్ అడుగులో అడుగులు వేస్తూ కదిలిన భట్టి

by Disha Web Desk 2 |
రాహుల్ అడుగులో అడుగులు వేస్తూ కదిలిన భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ సమైక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా, గుడబల్లేరు గ్రామంలోని కృష్ణానది బ్రిడ్జిపైన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎదిరేగి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేస్తూ భట్టి విక్రమార్క భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడే క్రమంలో పాదయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికీ డీసీఎం పైకి ఎక్కి భట్టి విక్రమార్క అభివాదం చేశారు. భారత్ జోడో కల్చరల్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొమ్ము కోయ, కోలాట నృత్యం, డప్పుల దరువు, ధూంధాం కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా భద్రాచలం గిరిజన సాంప్రదాయ నృత్యమైన కొమ్ము కోయ, కళాకారులు భారత్ జోడో యాత్రలో చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కోలాట నృత్యం, డప్పుల దరువు, కళాకారుల ఆట-పాట మాటలు పాదయాత్రలో జోష్‌ను పెంచాయి.

Next Story

Most Viewed