కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది: Ponnala Lakshmaiah

by Disha Web Desk 12 |
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది: Ponnala Lakshmaiah
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ పీసీసీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని.. తన లాంటి సీనియర్ నాయకునికే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన పూర్తి వివరాలతో కూడా లేఖను మల్లీకార్జున ఖర్ఘేకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తాను 45 ఏళ్లపాటు పనిచేశానని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నాయకుడిని అని.. అలాంటి నాకే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వల్ల తమను పట్టించుకునే పరిస్థితులే లేవని అవేదన వ్యక్తం చేశారు.

అలాగే పార్టీ పరిస్థితి గురించి చెబితే పట్టించుకోరని.. బీసీ నాయకుడినైన నన్ను తీవ్రంగా అవమానించారని అన్నారు. అలాగే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నందరు సంతోషించానని.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని తనలాంటి నాయకుడికే అవమానాలు ఎదురయ్యాయని పొన్నాల లక్ష్మయ్య కన్నీరు పెట్టుకున్నారు. కాగా పొన్నాల రాజీనామాపై నిన్న స్పందించిన రేవంత్ రెడ్డీ.. 45 ఎళ్లు పార్టీ నుంచి అన్ని అనుభవించి.. సచ్చే సమయంలో పార్టీ మారడం ఎంటని.. పొన్నాలకు పార్టీ మారడంపై సిగ్గు ఉండాలని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed