ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజుల సెలవులు.. హాలిడే లిస్ట్ ఇదే

by Disha Web Desk 13 |
ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజుల సెలవులు.. హాలిడే లిస్ట్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో:మరి కొన్ని రోజుల్లో మార్చి నెల ముగిసి ఏప్రిల్ నెల రాబోతున్నది. అలాగే 2023-2024 ఆర్థిక సంవత్సరం కూడా ముగియనున్నది. దీంతో నిత్యం బ్యాంకు వ్యవహారాలతో పని ఉంటే వారు బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. అయితే రాబోయే నెలలో వారాంతాల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో పాటు ఏప్రిల్ నెలలో ఉగాది, రంజాన్, శ్రీరామనవి, అంబేద్కర్ జయంతి వంటి ముఖ్యమైన పండగలు ఉన్నాయి. బ్యాంకు సెలవులను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఈ సెలవుల్లో జాతీయ జాతీయ సెలవులు సహా.. ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ నెల 30 రోజులలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులకు హాలిడేస్ వివరాలపై ఓ లుక్ వేద్దాం.

ఏప్రిల్ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే:

-ఏప్రిల్ 1- సోమవారం- ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది)

-ఏప్రిల్ 5- శుక్రవారం- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్- ఉల్- విదా (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది)

-ఏప్రిల్ 7- ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

-ఏప్రిల్ 9 - మంగళవారం- ఉగాది, గుడి పడ్వా, తెలుగు నూతన సంవత్సరాది (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)

-ఏప్రిల్ 10 - బుధవారం- రంజాన్ (ఈద్- ఉల్- ఫితుర్)- కేరళలోని బ్యాంకులకు హాలిడే.

-ఏప్రిల్ 11- గురువారం- రంజాన్ (దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)

-ఏప్రిల్ 13- రెండో శనివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే బిజు పండగ, బైశాఖి పండగ

-ఏప్రిల్ 14- ఆదివారం

-ఏప్రిల్ 15- సోమవారం- బోహాగ్ బిహు/ హిమాచల్ డే (అసోం, హిమాచల్ ప్రదశ్, మధ్యప్రదేశ్‌లో బ్యాంకులకు హాలిడే)

-ఏప్రిల్ 17- బుధవారం- శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)

-ఏప్రిల్ 20- శనివారం- గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు

-ఏప్రిల్ 21- ఆదివారం

-ఏప్రిల్ 27- నాలుగో శనివారం

-ఏప్రిల్ 28- ఆదివారం


Next Story

Most Viewed