వినోద్ కుమార్ కుటుంబ అక్రమాలు నిజమే: బండి సంజయ్

by Disha Web Desk 2 |
వినోద్ కుమార్ కుటుంబ అక్రమాలు నిజమే: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్రలో భాగంగా మాట్లాడారు. ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350 పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో ప్రజాహిత యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు. వందరోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా కొన్ని చోట్ల పథకాల్లో కోత పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా 50 లక్షల కుటుంబాలకు పథకాల్లో కోత పెట్టడం అన్యాయం అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కనబెట్టి.. అభివృద్ధి చేస్తే కేంద్రం సహకరిస్తుందని హితవు పలికారు. ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గడం లేదని సీరియస్ అయ్యారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నదని గుర్తుచేశారు. భూదాన్ భూముల పేరుతో వినోద్ కుటుంబ సభ్యులపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిజమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయిస్తామని చెప్పారు.


Next Story

Most Viewed