ఫ్లాష్ ఫ్లాష్.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్

by Mahesh |
ఫ్లాష్ ఫ్లాష్.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జిల్లా సెష‌న్స్ కోర్టు జ‌డ్జి అనిత ఆదేశాలు జారీ చేశారు. హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 కింద కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో బండి సంజ‌య్‌ను పోలీసులు హ‌నుమకొండ కోర్టు కాంప్లెక్స్ ప‌క్క‌నే జ‌డ్జి అనిత రాపోలు ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. బుధ‌వారం 4:10 నిముషాల‌కు హ‌న్మ‌కొండ కోర్టుకు బండి సంజ‌య్‌ను తీసుకువ‌చ్చిన పోలీసులు జ‌డ్జి అనిత ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు.

వ‌రంగ‌ల్ పోలీసులు క‌స్ట‌డి పిటిష‌న్ వేయ‌గా, రిమాండ్‌ను తిర‌స్క‌రించాల‌ని కోరుతూ బీజేపీ లీగ‌ల్ టీం కోరింది. ఈమేర‌కు జ‌డ్జి ఎదుట ఇరు ప‌క్షాల లాయ‌ర్లు త‌మ వాద‌న‌లు వినిపించారు. వాద‌న‌లు ముగిసిన మూడు గంట‌ల త‌ర్వాత జ‌డ్జి అనిత ఆదేశాలు జారీ చేశారు. బండి సంజ‌య్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బండి సంజ‌య్‌ను కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారు. తాజా ఆదేశాల‌తో హ‌న్మ‌కొండ కోర్టు వ‌ద్ద ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోనూ ప‌లు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లోనూ పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ లీగ‌ల్ టీం బండి సంజ‌య్ అరెస్టు అక్ర‌మ‌మ‌ని, ఏమాత్రం చ‌ట్టాల‌కు లోబ‌డి జ‌ర‌గ‌లేదని, చ‌ట్టాల‌ను అతిక్ర‌మిస్తూ ఎంపీని అరెస్టు చేయ‌డం స‌రైంది కాద‌ని, రిమాండ్ పిటిష‌న్‌ను ర‌ద్దు చేయాల‌ని వాద‌న‌లు వినిపించారు. అయితే జ‌డ్జి సుదీర్ఘ స‌మ‌యం త‌ర్వాత బండి సంజ‌య్‌కు రిమాండ్ విధింపున‌కే మొగ్గు చూపారు.

ఇవి కూడా చదవండి:

DGP Office: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వెనక్కి తీసుకున్న రఘునందన్ రావు

బండి సంజయ్ అరెస్ట్‌ వెనుక ఆ లీక్ వీరుడు ఎవరు..?.. అనుమానాలు ఎన్నెన్నో..?

Next Story

Most Viewed