ఆ విషయం కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదా?: Bandi Sanjay

by Disha Web Desk 2 |
ఆ విషయం కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదా?: Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయిందన్నారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అంశం ఒక డ్రామా అని ఎద్దేవా చేశారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు ఎటు పోయారో కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ లేరని అన్నారు.

Read More...

'12 మంది ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొడతాం'


Next Story