సిద్దిపేటపై ‘బండి’ ఫోకస్.. అగ్రనేతల వరుస పర్యటనలు

by Dishanational2 |
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
X

గులాబీ కంచుకోట సిద్దిపేట నియోజకవర్గంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టిందా అంటే..? బీజేపీ అగ్రనేతల వరస పర్యటనలు.. క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సిద్దిపేట ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్తిస్తూ వీలు చిక్కినప్పడల్లా సిద్దిపేటలో ఆగి నియోజకవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నాంచారిపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావుతో కలిసి ప్రారంభించారు. మురళీధర్ రావు నియోజకవర్గ పరిధిలో ఏడు రోజులపాటు బైక్ ర్యాలీలు నిర్వహించి, బీజేపీ సిద్ధాతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. బూత్ లెవల్ కమిటీల నియామక ప్రక్రియను పర్యవేక్షించి కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా బీజేపీ నాయకురాలు, సినీనటి జీవితా రాజశేఖర్ సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సిద్దిపేట ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్తిస్తూ వీలు చిక్కినప్పడల్లా సిద్దిపేటలో ఆగి నియోజకవర్గ నేతలతో భేటీలునిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నాంచారిపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావుతో కలిసి ప్రారంభించారు. మురళీధర్ రావు నియోజకవర్గ పరిధిలో ఏడు రోజులపాటు బైక్ ర్యాలీలు నిర్వహించి, బీజేపీ సిద్ధాతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. సిద్దిపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలపై, వీఆర్ఏల పోరాటంలో పాల్గొని భరోసానిచ్చే యత్నం చేశారు. తదనంతరం భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తల నివాసాల్లో సహపంక్తి భోజనాలు చేశారు. దీనికి తోడు బూత్ లెవల్ కమిటీల నియామక ప్రక్రియను పర్యవేక్షించి కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా బీజేపీ నాయకురాలు, సినీనటి జీవితా రాజశేఖర్ సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించారు.

ఈవారంలో రెండుమార్లు బండి పర్యటన

సిద్దిపేట నియోజక వర్గంలో గత కొంత కాలంగా బీజేపీ అగ్రనేతల వరస పర్యటనలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అదినాయకత్వం పర్యటనలు అటుంచితే.. ఇటీవల రెండు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. గత మంగళవారం రాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్టు కంటే ముందు సిద్దిపేట అమర వీరుల స్తూపం వద్ద విలేఖరులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో బీఆర్ ఎస్ నేతలు నినాదాలు చేయడంతో కరీంనగర్ వెళ్లి పోయ్యారు. తదుపరి బెయిల్ పై విడుదల అనంతరం కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్లుతున్న క్రమంలో శుక్రవారం బండి సంజయ్ అమరవీరుల స్తూపానికి నివాలర్పించి, బీఆర్ఎస్ నాయకత్వంపై నిప్పులు చెరిగారు.

పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి

సిద్దిపేట నియోజకవర్గంలో బీజేపీలో చేరికలపై బీజేపీ రాష్ట్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుంటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్న ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ను బీజేపీలోకి తీసుకున్నారు. దీనికి తోడు నియోజక వర్గంలోని పలువురు నేతలను బీజేపీలోకి తీసుకునేందుకు యత్నాలు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా గులాబీ కంచుకోట, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ ఫలిస్తోందో.. లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed