- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టులో బల్మూరి వెంకట్ పిటిషన్
by Disha Web Desk 14 |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇటీవలి వరదల్లో చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, రైతుబంధుతో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతీ రైతుకు 50వేల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ర్టవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో 44 మంది మరణించారు. ఇలా చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 10లక్షల ఆర్థిక సాయం అందించటంతోపాటు వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కాలువలకు వెంటనే మరమ్మత్తులు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్నారు.
Next Story