షర్మిల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

by Disha Web Desk 12 |
షర్మిల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల బెయిల్ పిటిషన్ పై మంగళవారం వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, ఈ రోజు సాయంత్రం లోపు బెయిల్ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ పై షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవే అని చెప్పారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.

హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించ లేదని చెప్పారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అంతకంటే ముందు చోటు చేసుకున్న పరిణామల వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్నారు. షర్మిలపై పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నట్టు చెప్పారు. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Read More:

షర్మిలకు కనీసం రెండేళ్లు శిక్ష పడే ఛాన్స్ : హై కోర్టు అడ్వకేట్ (వీడియో)

బ్రేకింగ్ : షర్మిలకు బెయిల్ మంజూరు

Next Story

Most Viewed