కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR మరో సంచలన ట్వీట్

by Anjali |
కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR మరో సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మరోసారి సంచలన ట్వీట్ చేశారు. “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు. అంటూ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి, పురుగుల అన్నం, నీళ్ల చారు.. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు.. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం, నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి.. 20 మంది విద్యార్థులకు వాంతులు’ ఇది కాంగ్రెస్ పాలన అని ఎద్దేశా చేశారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు ఆందోళన చేందారన్నారు. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ? అంటూ గొంతెత్తి ప్రశ్నించారు. ఆడుకోవాల్సిన వయసులో కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ.. ఈ అస్వస్థత అంటూ కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి లేకపోతే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని అన్నారు. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం జరుగుతుందని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చురుకులంటించారు.

Advertisement

Next Story