వాళ్లందరిపై కేసులు ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
వాళ్లందరిపై కేసులు ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజులకే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2009 నుండి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.Next Story

Most Viewed