‘తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి’.. CM రేవంత్‌‌కు హరీష్ రావు మరో బహిరంగ లేఖ

by Disha Web Desk 19 |
‘తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి’.. CM రేవంత్‌‌కు హరీష్ రావు మరో బహిరంగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మాట నమ్మి లక్షల మంది రైతులు పంటల రుణాలు తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా.. రాష్ట్రంలో ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.

బ్యాంకుల నుండి రైతులకు నోటీసులు వస్తున్నాయని, దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చినట్లుగా ప్రతిపంటకు ఎకరానికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.

Also Read...

కొట్టుకుపోయిందన్న కాళేశ్వరంలో జలహోరు ఎలా స్టార్ట్ అయ్యింది..? రేవంత్ సర్కార్‌పై KTR ఫైర్

Next Story

Most Viewed