టీఎస్‌‌పీఎస్‌సీలో మరో సభ్యురాలు రాజీనామా

by Disha Web Desk 2 |
టీఎస్‌‌పీఎస్‌సీలో మరో సభ్యురాలు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో సభ్యురాలు రాజీనామా చేశారు. అరుణ కుమారి అనే సభ్యురాలు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు శనివారం పంపించారు. ఇటీవల చోటుచేసుకున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ తన పాత్ర ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల రాజీనామాలు చేసిన నాతోటి సభ్యులతో పాటు తాను రాజీనామా చేయకపోవడానికి బలమైన కారణం ఉందని అన్నారు.


‘నాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగంలో స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉండి భూ భారతీ సర్వే డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా ఉంటూ స్వతహాగా రాజీనామా చేసి టీఎస్‌పీఎస్‌సీ బోర్డులోకి వచ్చాను. అందుకే పాత సభ్యులతోపాటు నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భావించాను. కానీ, నేను రాజీనామా చేయకపోతే పాత బోర్డు మొత్తం ర్దదు పరిచినట్లు కాదని.. నా వల్ల నిరుద్యోగ బిడ్డలకు నష్టం వాటిల్లుతుందని భావించి టీఎస్‌పీఎస్‌‌సీ మెంబర్ షిప్‌కు రాజీనామా చేస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.



Next Story