లంచగొండి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ మరో కీలక నిర్ణయం

by Disha Web Desk 13 |
లంచగొండి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ మరో కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో:కరప్షన్ ప్రీ తెలంగాణ దిశగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏసీబీ తొలిసారి ట్విట్టర్ (ఎక్స్) లోకి అడుగుపెట్టింది. శనివారం నాడు ఏసీబీ తెలంగాణ పేరుతో అధికారికంగా ట్విట్టర్ ఖాతా తెరిచింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ప్రొఫైల్ ఫోటోతో ఉన్న ఈ అకౌంట్ లో తొలిపోస్ట్ చేసిన ఏసీబీ.. ఫిర్యాదులను ట్విట్టర్ వేదికగా చేయవద్దని సూచించింది. టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 లేదా [email protected] ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతి అధికారులను పట్టుకోవచ్చని సూచించింది. ఒక వేళ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతి పరులు జాగ్రత్త పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఏసీబీ ప్రారంభించిన అధికారిక ఖాతాకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పలువురు నెటిజన్లు ఏసీబీ అధికారుల ఈ ప్రయత్నా్న్ని ప్రశంసిస్తుంటే డీజీ ఆనంద్ కుమార్ నిర్ణయం చాలా బాగుందని తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా ఇటీవల ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ ఆనంద్ శాఖ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల రెయిట్స్ నిర్వహిస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్న ఏసీపీ తాజాగా సోషల్ మీడియాను సైతం ఉపయోగించుకోవడం ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed